రోడ్డు వెడల్పు కోసం తవ్వకాలు.. పగిలిన డ్రైనేజీ పైపులు

రోడ్డు వెడల్పు కోసం తవ్వకాలు.. పగిలిన డ్రైనేజీ పైపులు

PDPL: గోదావరిఖని కూరగాయల మార్కెట్ పక్కన రోడ్డు వెడల్పు కోసం రామగుండం బల్దియా అధికారులు ఇటీవల తవ్వకాలు జరిపారు. షాపుల ముందు తవ్వకాలు చేయడంతో డ్రైనేజీ పైపులు పగిలి మురికి నీరంతా బయటికి వచ్చి దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో వ్యాపారస్థులు తీవ్ర అసౌకర్యాలకు గురవుతున్నారు. రోడ్డు వెడల్పుతో పాటు పైపులకు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.