ప్రొద్దుటూరులో భారీగా బంగారం చోరీ

KDP: ప్రొద్దుటూరులో ఒకేరోజు రెండు సంఘటనలు జరిగాయి. స్థానిక బొల్లవరం నరాల బాలిరెడ్డి కాలనీలో యనమల చంద్రశేఖర్ రెడ్డి ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరు లేని సమయంలో 60 తులాల బంగారం చోరీ జరిగింది. మరోవైపు స్థానిక రామేశ్వరం బైపాస్ రోడ్డులో వాహన తనిఖీల్లో పోలీసులు ఓ కారులో రికార్డులు లేని 18 కేజీల బంగారు ఆభరణాలను పట్టుకున్నారు.