కాకతీయ యూనివర్సిటీ విచారణ కమిటీపై SFI ఆగ్రహం
HNK: కాకతీయ యూనివర్సిటీలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తులనే విచారణ కమిటీ సభ్యులుగా నియమించడాన్ని SFI తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. గత కమిటీ నివేదికలపై చర్యలు తీసుకోని యాజమాన్యం అధికార దుర్వినియోగం చేస్తోందని ఆరోపించింది. నిష్పాక్షిక కమిటీ ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ SFI నేతలు ఇవాళ ప్రొ.రామచంద్రానికి వినతిపత్రం అందజేశారు.