కార్డుల ద్వారా రైతులకు ఎంతో ఉపయోగం: AO
MHBD: రైతులకు విత్తనాలు, ఎరువులు కార్డు ద్వారా పంపిణీ చేస్తే ఎన్నో ఉపయోగాలున్నాయని బయ్యారం మండల AO రాజు తెలిపారు. ఎరువుల కోసం రైతులు ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు కార్డు ఆలోచన వచ్చిందని, రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తే అద్భుత ఫలితాలు వస్తాయని అన్నారు. జిల్లాలో 2 లక్షల మంది రైతులకు ఈ కార్డు అందేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లు AO పేర్కొన్నారు.