బాలిక అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు

బాలిక అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు

KDP: ఒంటిమిట్టకు సమీపంలోని ఓ గ్రామంలో మైనర్ బాలిక అదృశ్యం అయినట్లు బాలిక తండ్రి స్థానిక పోలీసు స్టేషన్లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. తన కూతురు గురువారం ఉదయం 11 గంటల నుంచి కనిపించకుండా పోయిందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. సమీప బంధువులు, స్థానికులను విచారణ చేసినా ఆచూకీ తెలియరాలేదన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.