అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

మేడ్చల్: నాచారం రామ్ రెడ్డి నగర్‌లో 10 లక్షల రూపాయల వ్యయంతో కొత్తగా నిర్మించనున్న భూగర్భ డ్రైనేజీ పనులకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, స్థానిక కార్పొరేటర్ శాంతి సాయి జన శేఖర్ తో కలిసి శంకుస్థాపన చేసారు. తొందరలోనే రామ్ రెడ్డి నగర్ లో సిమెంట్ రోడ్లు కూడా వేయించి ఎలాంటి సమస్యలు లేకుండా చూస్తామని స్థానికులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.