చైన్ స్నాచర్‌పై పీడీ యాక్ట్
KMM: మహిళల నుంచి గొలుసు చోరీలకు పాల్పడుతున్న గణేష్‌పై పీడీ యాక్ట్ నమోదు చేసి చంచల్ గూడ సెంట్రల్ జైలుకు తరలించినట్లు సత్తుపల్లి రూరల్ సీఐ ముత్తులింగం తెలిపారు. ఏపీకి చెందిన గణేష్‌పై ఏపీలో 13, ఖమ్మం జిల్లాలో ఐదు కేసులు నమోదయ్యాయి. ఇళ్లలో, రోడ్లపై ఒంటరి మహిళలను గుర్తించి చోరీ చేస్తుండడంతో గణేష్‌పై పీడీ యాక్ట్ అమలు చేసినట్లు తెలిపారు.