విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
JGL: వెల్గటూరు మండలం రాజక్కపల్లి గ్రామానికి చెందిన కుస్నపల్లి శ్రీనివాస్ (45) అనే వ్యక్తి మంగళవారం తన ఇంటిలో విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. తన ఇంటిలోనే ఫ్యాన్ స్విచ్ ఆన్ వేస్తుండగా కరెంట్ షాక్ వచ్చి అక్కడికక్కడే మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. ఇటీవల కాలనీలో ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఎర్త్ షాక్ వస్తుందని స్థానికులు తెలిపారు.