VIDEO: విద్యార్థినిల ధర్నా.. ఉద్యోగులు సస్పెండ్
MLG: జిల్లా కేంద్రంలోని మోడల్ స్కూల్ హాస్టల్‌లో నిన్న విద్యార్థినిలు మౌలిక సౌకర్యాల కొరత, సిబ్బంది నిర్లక్ష్యంపై ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. కాగా, కలెక్టర్ దివాకర, DEO సిద్ధార్థ రెడ్డి ఇవాళ హాస్టల్‌కు వెళ్లి విచారణ చేపట్టారు. విచారణ అనంతరం హాస్టల్ వార్డెన్, ANM, వాచ్‌మెన్‌లను సస్పెండ్ చేసి.. విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చారు.