కర్నూలులో 'ప్రపంచ గ్లాకోమా' అవగాహన ర్యాలీ

కర్నూలులో 'ప్రపంచ గ్లాకోమా' అవగాహన ర్యాలీ

KRNL: 'ప్రపంచ గ్లాకోమా' వారోత్సవాల సందర్భంగా కర్నూలు ప్రభుత్వ కంటి ఆసుపత్రి నుంచి రాజవిహార్ సెంటర్ వరకు నిర్వహించిన వాకథాన్ ర్యాలీని జేసీ నూరుల్ ఖమర్ ప్రారంభించారు. జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో మార్చి 8 నుంచి 14 వరకు ఈ వారోత్సవాలు జరుగుతాయని ఆయన తెలిపారు. గ్లాకోమా రహిత ప్రపంచం కోసం ఐక్యం అవ్వాలనే థీమ్‌తో అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు.