VIDEO: తాండూర్ బస్ స్టేషన్‌లో దయనీయ పారిశుద్ధ్యం

VIDEO: తాండూర్ బస్ స్టేషన్‌లో దయనీయ పారిశుద్ధ్యం

VKB: తాండూర్ బస్ స్టేషన్‌లో పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా మారింది. ఆవరణమంతా చెత్తాచెదారం, మురుగు నీరు పేరుకుపోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది. ఈగలు, దోమలు అధికంగా పెరగడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజూ వేలాది మంది రాకపోకలు సాగించే బస్టాండ్‌ను వెంటనే శుభ్రం చేసి, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని ప్రజలు అధికారులను డిమాండ్ చేస్తున్నారు.