డిప్యూటీ సీఎం కాన్వాయ్‌పై రాళ్లు, చెప్పులతో దాడి

డిప్యూటీ సీఎం కాన్వాయ్‌పై రాళ్లు, చెప్పులతో దాడి

బీహార్ డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. లఖీసరాయ్‌లోని ఖోరియారిలో పోలింగ్ బూత్ వద్దకు వచ్చిన ఆయన కాన్వాయ్‌పై RJD మద్దతుదారులు రాళ్లు, చెప్పులు విసిరి దాడి చేశారు. దీంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. RJD గూండాలు తనను అడ్డుకున్నారంటూ మండిపడ్డారు. కాగా, రాష్ట్రంలో మధ్యాహ్నం 1 గంట వరకు 42.31 శాతం పోలింగ్ నమోదైంది.