హెల్మెట్ ధారణతో ప్రాణరక్షణ పొందవచ్చు: ASI
VZM: వాహనదారులు హెల్మెట్ ధారణతో ప్రాణ రక్షణ పొందవచ్చని బొబ్బిలి ASI కొండలరావు సూచించారు. గురువారం మున్సిపాలిటీలోని పాతబొబ్బిలి కూడలిలో ఆయన వాహనాల తనిఖీలు నిర్వహించి హెల్మెట్ ఆవశ్యకతను వివరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి డ్రైవింగ్ చేయాలన్నారు. ప్రమాదాలు జరిగితే హెల్మెట్ ప్రాణాపాయం నుంచి రక్షణ కల్పిస్తుందన్నారు.