VIDEO: ఖైరతాబాద్ గణేషుడి విగ్రహ పనుల్లో వేగం

HYD: ఖైరతాబాద్ గణేశుడి విగ్రహ పనులు శరవేగంగా సాగుతున్నాయి. గణేష్ చతుర్థికి 15 రోజులే మిగిలి ఉండటంతో పనుల్లో వేగం పెంచారు. దాదాపు విగ్రహాలు పూర్తి కాగా, తుదిరూపు ఇచ్చి రంగులు వేయాల్సి ఉందని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టినట్లు, వర్షాల నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పనులను కొనసాగిస్తున్నామన్నారు.