అమెరికా విమాన వాహకనౌకపై ఇరాన్ దాడి..!
అమెరికా విమాన వాహకనౌక అబ్రహం లింకన్ లక్ష్యంగా ఇరాన్ దాడి చేసింది. ఇరాన్ సైనిక విభాగం (IRGC) తాము అబ్రహం లింకన్ నౌకపై డ్రోన్లతో దాడి చేశామని ప్రకటించింది. ఈ దాడిలో సదరు నౌక తీవ్రంగా దెబ్బతిని, వెనక్కి మళ్లుతోందని ఇరాన్ మీడియా పేర్కొంది. కానీ, అబ్రహం లింకన్‌కు సమీపంలోకి వచ్చిన ఇరాన్ నౌకలపై కాల్పులు జరిపినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది.