రాజకీయ కుట్రతో దాడి చేశారు: గోవింద్ రెడ్డి
సత్యసాయి: హైదరాబాద్‌లోని ABN ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ నాయకులు రాజకీయ కుట్రతో దాడి చేశారని పరిగి టీడీపీ కన్వీనర్ గోవింద్ రెడ్డి తెలిపారు. గురువారం పరిగి మండలం టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. మీడియా సంస్థలపై దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.