వేసవిలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలి: ఎస్పీ

కృష్ణా: వేసవి కాలంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు పేర్కొన్నారు. శనివారం మచిలీపట్నంలో ఆయన మాట్లాడుతూ.. వేసవి సెలవుల సందర్భంగా ఇళ్లకు తాళం వేసుకుని ఊరికి వెళ్లే వారు స్థానిక పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వాలన్నారు. తద్వారా రాత్రి, పగలు గస్తీ విధులు నిర్వహించే పోలీస్ సిబ్బంది మీ ఇంటి చుట్టుపక్కల ప్రాంతంలో నిఘాను ఏర్పాటు చేస్తారన్నారు.