50 వేల మంది మహిళలకు 'ఉల్లాస్' వెలుగులు
KMM: 15ఏళ్లు నిండిన నిరక్షరాస్యులైన మహిళలకు సంపూర్ణ అక్షరాస్యత కల్పించేందుకు కేంద్రం 'ఉల్లాస్' పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద జిల్లాలోని డ్వాక్రా మహిళల్లో 50వేల మందికి పైగా అక్షరాస్యులు కానీ వారిని గుర్తించారు. వీరికి చదవడం,రాయడంతో పాటు జీవన నైపుణ్యాలు నేర్పడానికి ప్రతి10మందికి ఒక వలంటీర్‌ను నియమించి, అంగన్వాడీ కేంద్రాలు,పంచాయతీల్లో శిక్షణ ఇస్తున్నారు.