బిగ్‌బాస్‌ వేదికపై కన్నీరు పెట్టుకున్న సల్మాన్‌

బిగ్‌బాస్‌ వేదికపై కన్నీరు పెట్టుకున్న సల్మాన్‌

హిందీ బిగ్ బాస్ సీజన్ 19 గ్రాండ్ ఫినాలేలో హోస్ట్ సల్మాన్ ఖాన్ ఎమోషనల్ అయ్యాడు. గతంలో బిగ్ బాస్ షోకు వచ్చిన దివంగత నటుడు ధర్మేంద్ర వీడియోను ప్రదర్శించగా.. అది చూసి సల్మాన్ కన్నీరు పెట్టుకున్నాడు. 'మనం హీ మ్యాన్‌ను కోల్పోయాం. ఆయనకంటే గొప్ప వ్యక్తులు ఎవరూ లేరు' అంటూ ధర్మేంద్రతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. ఇక ఈ సీజన్‌లో గౌరవ్ ఖన్నా విజేతగా నిలిచాడు.