బాల్య వివాహాలపై అవగాహన సదస్సు
NRPT: నారాయణపేటలో ఈనెల 6న గురువారం మధ్యాహ్నం 1 గంటకు ఎస్ఆర్ గార్డెన్స్ ఫంక్షన్ హాలులో బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని పూజారులు, పాస్టర్లు, ఖ్వాజీలు, ఫంక్షన్ హాల్ యజమానులు, డీజే నిర్వాహకులు తప్పకుండా హాజరు కావాలని ఆమె ప్రకటనలో కోరారు.