PUలో వంద మంది విద్యార్థులు ఫెయిల్

PUలో  వంద మంది విద్యార్థులు ఫెయిల్

MBNR: జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇంజనీరింగ్ కళాశాలలో ఇటీవల జరిగిన పరీక్షలలో వంద మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. మొత్తం 190 మంది పరీక్షలు హాజరుకాగా కేవలం 90 మంది మాత్రమే పాస్ అయ్యారు. యూనివర్సిటీలో సొంతంగా ల్యాబ్ లేకపోవడంతో ప్రైవేట్ కళాశాలలో ప్రాక్టికల్స్ చేయడంతో ఈ పరిస్థితి వచ్చినట్టు తెలుస్తోంది.