ఆర్మూర్‌లో దంచి కొడుతున్న ఎండలు

NZB: ఆర్మూర్‌లో రోజు రోజుకు ఎండలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ఉదయం 9 గంటలకే 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. దీంతో ప్రజలు ఇళ్ల నుండి బయటికి రావడానికి జంకుతున్నారు. ఎండ తీవ్రత వల్ల ప్రజలు ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. ఎండ నుండి ఉపశమనం పొందడానికి శీతల పానీయాలు సేవిస్తున్నారు. ఉదయం మొదలుకొని సాయంత్రం ఐదు తర్వాత కూడా ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి.