కాంగ్రెస్ ఆరోపణలపై బండిసంజయ్ కౌంటర్

TG: కాంగ్రెస్ ఓటు చోరీ ఆరోపణలపై కేంద్రమంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. 'ముందుగా ఓటు చోరీ గురించి కాదు, జగిత్యాలలో సీట్ల చోరీ గురించి మాట్లాడాలి. ఓటు చోరీ పేరుతో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలను అవమానించారు. 6 గ్యారెంటీలపై కాంగ్రెస్ నేతలను ప్రజలు కొట్టేటట్లు ఉన్నారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం చేస్తా' అని వ్యాఖ్యానించారు.