అలర్ట్.. పరీక్షల టైమ్ టేబుల్ విడుదల

NTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలోని కళాశాలల్లో బీపీఈడీ, ఎంపీఈడీ కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్ థియరీ రెగ్యులర్ & సప్లిమెంటరీ పరీక్షల టైమ్ టేబుల్ విడుదలైంది. జులై 8, 9, 10, 11 తేదీలలో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు 70 మార్కులకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని ANU అధ్యాపక వర్గాలు తెలిపాయి.