ఐదు గ్రామాలను దత్తతతీసుకొన్న డిగ్రీ కళాశాల
SKLM: కేంద్ర ప్రభుత్వ ఉన్నత భారత్ అభియాన్ కింద తొగరాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఐదు గ్రామాలను దత్తత తీసుకుంది. ఈ సందర్భంగా కళాశాలలో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం సమన్వయకర్త డా. బి. పావని ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గ్రామాల్లో మౌలిక వసతులు, పరిశుభ్రత, విద్య, వైద్యం, పర్యావరణం, హస్తకళల అభివృద్ధిలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.