వెల్దుర్తిలో రిజర్వేషన్‌లను ప్రకటించిన అధికారులు

వెల్దుర్తిలో రిజర్వేషన్‌లను ప్రకటించిన అధికారులు

MDK: వెల్దుర్తి ఎంపీడీవో కార్యాలయంలో ఆదివారం గ్రామపంచాయతీ వార్డు రిజర్వేషన్లను డ్రా పద్ధతిలో నిర్వహించారు. ఎంపీడీవో అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో మొత్తం మండల వ్యాప్తంగా 200 వార్డు సభ్యులు ఉన్నట్లు తెలిపారు. ఇందులో 97 జనరల్, 52 బీసీ, 36 ఎస్సీ, 15 ఎస్టీ రిజర్వేషన్ ప్రకటించారు. 127 పురుషులకు, 73 మంది మహిళలకు రిజర్వేషన్ కేటాయించారు.