రాజధానిలో శ్రీవారి ఆలయానికి రెండో ప్రాకారం
AP: రాజధాని ప్రాంతం వెంకటపాలెం సమీపంలో టీటీడీ నిర్మించిన ఆలయానికి రెండో ప్రాకారం నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ నెల 27 సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆ రోజు ఉదయం 10:55 నుంచి 11:30 గంటల మధ్య ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. తిరుమల మాదిరిగా ఇక్కడ కూడా రెండో ప్రాకారం రూపుదిద్దుకోనుంది.