ఘనంగా దత్త జయంతి కార్యక్రమం
BPT: వేటపాలెం మండలం చల్లారెడ్డి పాలెం పంచాయతీ పరిధిలో ఉన్న దత్తక్షేత్రం నందు గురువారం దత్త జయంతి సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరిగాయి. నియోజకవర్గం నలుమూలల నుంచి భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. 7 వేల మందికి పైగా అన్నదానం నిర్వహించినట్లు ఆలయ అధ్యక్షులు వెంకట సుబ్బారావు చెప్పారు.