స్మార్ట్ కార్డుల పంపిణీ వేగంగా జరుగుతుంది: జేసీ

స్మార్ట్ కార్డుల పంపిణీ వేగంగా జరుగుతుంది: జేసీ

కోనసీమ: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అందించిన స్మార్ట్ కార్డుల పంపిణీ వేగంగా జరుగుతోందని, దాదాపు లక్ష కార్డుల పంపిణీ పూర్తయిందని జేసీ నిశాంతి తెలిపారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. చాలా కార్డుల్లో అంబేద్కర్ కోనసీమ జిల్లాకు బదులుగా పూర్వపు ఉమ్మడి జిల్లా తూర్పుగోదావరి పేరు వచ్చిందని, దీనికి కారణం ఆధార్ కార్డు డేటా ప్రకారమే కార్డులు ముద్రించడం అని ఆమె పేర్కొన్నారు.