క్రేజీ కాంబో.. రవితేజ సరసన సమంత?

క్రేజీ కాంబో.. రవితేజ సరసన సమంత?

మాస్ మహారాజా రవితేజ, స్టార్ హీరోయిన్ సమంత కలిసి ఓ సినిమాలో నటించబోతున్నారనే వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించనున్న ఓ పవర్‌ఫుల్ క్రైమ్ థ్రిల్లర్ కథలో వీరు జోడిగా నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ కాంబినేషన్‌లో సినిమా ఈ నెలలోనే లాంఛనంగా ప్రారంభం కావచ్చు అనే టాక్ బలంగా వినిపిస్తోంది.