జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

ప్రకాశం: కనిగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతం చేసేందుకు జన సైనికులు కృషి చేయాలని నియోజకవర్గ జనసేన పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వరి కూటి నాగరాజు అన్నారు. కనిగిరి జనసేన కార్యాలయంలో నాలుగో విడత సభ్యత్వ కిట్లను నాయకులకు ఆయన పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో జనసేన జెండాలను ఆవిష్కరించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.