మండలి కృష్ణారావు జీవితం ఆదర్శనీయం
కృష్ణా: కృష్ణారావు జీవితం ఆదర్శనీయమని టీడీపీ ఘంటసాల మండల అధ్యక్షుడు తుమ్మల చౌదరిబాబు అన్నారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, దివిసీమ పునర్నిర్మాత స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం అవనిగడ్డ వంతెన సెంటర్లోని కృష్ణారావు విగ్రహానికి తుమ్మల చౌదరిబాబు, నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ నివాళులు అర్పించారు.