VIDEO: ఆంజనేయస్వామి ఆలయంలో భక్తుల రద్దీ

VIDEO: ఆంజనేయస్వామి ఆలయంలో భక్తుల రద్దీ

KRNL: ఆదోని కొండల్లోని శ్రీ రణమండల ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. మంగళహారతులు, మంత్రోచ్చారణల మధ్య భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. శనివారం కావడంతో భక్తుల రద్దీ నెలకొంది. స్వామి దర్శనం వల్ల దుష్టపీడలు తొలగి ఆయురారోగ్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. భక్తుల కోసం నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.