ఘనంగా ప్రపంచ రంగస్థల దినోత్సవం

ఘనంగా ప్రపంచ రంగస్థల దినోత్సవం

మంచిర్యాలలో శుక్రవారం జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రానికి చెందిన నటుడు అశోక్ వేములను సత్కరించారు. అనంతరం సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు అనేక చిత్రాలు, షార్ట్ ఫిల్మ్‌లలో నటించిన అశోక్ ఉన్నతస్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు.