సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్: జేసీ అస్మిత్ రెడ్డి
ATP: తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి శనివారం ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. నియోజకవర్గ ప్రజల నుంచి ఆయన అధికారుల సమక్షంలో ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.