నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన డిప్యూటీ స్పీకర్

W.G: ఆకివీడు మండలం దుంపగడప వి.వి.గిరి ప్రభుత్వ కళాశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి రాష్ట్ర డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజు సోమవారం శంకుస్థాపన చేశారు. రాజమండ్రి ఎల్ఐసి సహకారంతో నూతన భవనం నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు