హైదరాబాద్‌లో సత్తా చాటిన జిల్లా విద్యార్థిని
KDP: తెలంగాణ అథ్లెటిక్స్ ఓపెన్ క్యాటగిరీ ఛాంపియన్‌షిప్‌లో జిల్లా ప్రతిభ మరోసారి రుజువైంది. సింహాద్రిపురం మండలం దిద్దెకుంటకు చెందిన శివమల్లి రెడ్డి హైదరాబాద్‌లో జరిగిన 5 కిలోమీటర్ల పరుగు పందెంలో మంగళవారం స్వర్ణ పతకం సాధించింది. ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో బీకాం(B.Com) చదువుతున్న శివమల్లిని పులివెందుల ప్రజలు, కడప జిల్లా ప్రముఖులు అభినందించారు.