జిల్లాలో భారీ వడగండ్ల వాన
కామారెడ్డి జిల్లాలో వడగండ్ల వర్షం బీభత్సం సృష్టిస్తోంది. దోమకొండ, రాజంపేట, భిక్కనూరు మండలాల్లో కుండపోతగా కురుస్తోంది. దీంతో వేల ఎకరాల్లో వరి నేలపాలయింది. అలాగే, వందల ఎకరాల్లో జొన్న తోటలు నేలకొరిగాయ. రైతన్నలు తమకు భారీ నష్టం వాటిల్లిందని విలపిస్తున్నారు.