VIDEO: ప్లాస్టిక్ ఇవ్వండి.. బహుమతి పొందండి..!

VIDEO: ప్లాస్టిక్ ఇవ్వండి.. బహుమతి పొందండి..!

KMR: తాడ్వాయి మండలం ఎండ్రీయాల్లో ప్లాస్టిక్ నివారణపై గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి పంచాయతీకి ఇచ్చే వారికి బహుమతులు అందజేస్తామని సర్పంచ్ నర్సింలు ప్రకటించారు. ఇందులో భాగంగా కిలో ప్లాస్టిక్ కవర్లు తెచ్చిన 5వ వార్డు సభ్యుడికి స్టీల్ టిఫిన్ బాక్స్‌ను గిఫ్టుగా అందజేశారు.