శ్రీవారి దర్శనం మోసం.. ఇద్దరు అరెస్ట్
TPT: సోషల్ మీడియాలో శ్రీవారి వీఐపీ దర్శనం, వసతి కల్పిస్తామని చెప్పి భక్తులను మోసం చేసిన ఇద్దరిని తిరుమల పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నకిలీ ప్రకటనలు ఇచ్చి UPI ద్వారా డబ్బులు దోచుకున్నట్లు గుర్తించారు. పలు రాష్ట్రాల భక్తులను మోసం చేసినట్లు విచారణలో తేలింది. అధికారిక TTD మార్గాల ద్వారానే టిక్కెట్లు పొందాలని పోలీసులు సూచించారు.