'ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలి'
NDL: ప్రభుత్వ అధికారులు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని మంత్రి బీసీ రెడ్డి పేర్కొన్నారు. నిన్న రాత్రి బనగానపల్లెలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు ఆయనకు పలు సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు. దీంతో మంత్రి సమస్యలపై నేరుగా అధికారులతో మాట్లాడారు.