ఇజ్రాయెల్‌పై పుతిన్ సంచలన వ్యాఖ్యలు

ఇజ్రాయెల్‌పై పుతిన్ సంచలన వ్యాఖ్యలు

ఇరాన్-ఇజ్రాయెల్ పోరులో రష్యా మౌనం వెనుక ఉన్న అసలు గుట్టును అధ్యక్షుడు పుతిన్ బయటపెట్టారు. ఇజ్రాయెల్ ప్రస్తుతం దాదాపు రష్యన్ మాట్లాడే దేశమని, అక్కడ రష్యా మూలాలున్న 20 లక్షల మంది నివసిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తమ దేశానికి చెందిన ఇంతమంది ప్రజలు ఉన్న దేశంపై దాడికి ఎలా సహకరిస్తామని అన్నారు. రాజకీయాల కంటే తమ ప్రజల క్షేమానికే పెద్దపీట వేస్తున్నట్లు పుతిన్ స్పష్టం చేశారు.