పొగాకుపై 22 ఏళ్ల నిశ్శబ్ద పోరాటం.. టుబాకో కంట్రోల్ హీరోగా ఎంపిక
NLG: పొగాకు వ్యసనం సమాజాన్ని క్రమంగా కుదేలు చేస్తున్న నేపథ్యంలో, ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగి పొగాకుకు వ్యతిరేకంగా 22 ఏళ్లపాటు పోరాటం చేసి 'టుబాకో కంట్రోల్ హీరో' అవార్డుకు ఎంపికయ్యారు. డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్న రఘునందన్, గత 22 సంవత్సరాలుగా విలాసవంతమైన జీవితం గురించి ఆలోచించకుండా సమాజ శ్రేయస్సు కోసం శ్రమిస్తున్నందుకు గానూ ఈ అవార్డు వరించింది.