బీర తోటను ధ్వంసం చేసిన గుర్తుతెలియని వ్యక్తులు

బీర తోటను ధ్వంసం చేసిన గుర్తుతెలియని వ్యక్తులు

VKB: చౌడపూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన రైతు గజ్జి మల్లయ్య బీర తోట సాగు చేస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం ఎవరూ లేని సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు బీర తోటను పీకేశారని బాధితులు పేర్కొన్నారు. దాదాపు రూ. 50వేలు ఖర్చు చేసి కష్టపడి పెంచుకున్న తోటను ధ్వంసం చేశారని వాపోయారు. అధికారులు స్పందించి ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.