VIRAL: పెళ్లిలో చికెన్ లెగ్ పీస్‌ల కోసం గొడవ

VIRAL: పెళ్లిలో చికెన్ లెగ్ పీస్‌ల కోసం గొడవ

యూపీ అమ్రోహా జిల్లా హసన్‌పూర్‌లో ఓ పెళ్లి వేడుక చికెన్ లెగ్ పీస్‌ల కోసం రసాభాసగా మారింది. బిర్యానీలో తగినన్ని లెగ్ పీస్‌లు లేవని వరుడి తరఫు బంధువులు గొడవ చేశారు. ఇరువర్గాలు కుర్చీలను విసురుకున్నారు. ఈ ఘర్షణకు సంబంధించిన వీడియో SMలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. వీడియో ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.