తాత్కాలికంగా దీక్షను విరమించిన కార్మికులు

తాత్కాలికంగా దీక్షను విరమించిన కార్మికులు

CTR: మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులు వివిధ డిమాండ్లతో చేపట్టిన రిలే దీక్షను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు బుధవారం సంఘ నాయకులు శ్రీరాములు, కుమార్ తెలిపారు. పుంగనూరు పురపాలక కార్యాలయం వద్ద 18 రోజులపాటు దీక్షలు నిర్వహించారు. తమ సమస్యలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని రాష్ట్ర నాయకులు తెలియజేయడంతో దీక్షను విరమిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.