రేపు కనిగిరిలో డివిజన్ స్థాయి సమీక్ష సమావేశం
ప్రకాశం: కనిగిరిలో ఒంగోలు బస్టాండ్ నందు గల షాదీ ఖానాలో గురువారం ఉదయం 10 గంటలకు డివిజన్ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆర్డివో కేశవర్ధన్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ రాజాబాబు ఇతర జిల్లా ఉన్నతాధికారులు హాజరవుతున్నట్లు తెలిపారు. అయితే ఎంపీడీవోలకు, డిప్యూటీ ఎంపీడీవోలకు, పంచాయతీ కార్యదర్శులు తప్పక హాజరు కావాలన్నారు.