ఫ్లాగ్ డే ఫండ్‌కు SBI భారీ విరాళం

HYD: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ఆధ్వర్యంలోని హైదరాబాద్ సర్కిల్ ఉద్యోగులు తెలంగాణ సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి రూ. 37.16 లక్షలు విరాళంగా అందించి తమ దాతృత్వాన్ని ప్రదర్శించారు. ఇందులో భాగంగా SBI హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ సాయుధ దళాల పతాకదినోత్సవ నిధి ఛైర్‌పర్సన్, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు రూ. 37,16,500 చెక్కును అందజేశారు.