చీపురుపల్లిలో గోడ కూలి వ్యక్తి మృతి
VZM: గోడ కూలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చీపురుపల్లిలోని గాంధీ బొమ్మ జంక్షన్ వద్ద మంగళవారం జరిగింది. సూరు రామ్మోహన్ అనే వ్యక్తి పాత గృహాన్ని తొలగిస్తున్న సమయంలో బోర గంగులు (40) అనే వ్యక్తి కూలిన గోడకింద పడ్డాడు. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచినట్లు సమాచారం. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.