కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా

ADB: మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులతోపాటు వేతనాలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఏఐటీయుసీ రాష్ట్ర నాయకులు రాములు డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని వారు పేర్కొన్నారు.